బహుదా నదికి పొటెత్తిన వరద - డ్రోన్ దృశ్యాలు వైరల్
About this video
బహుదా నదికి పొటెత్తిన వరద - డ్రోన్ దృశ్యాలు వైరల్ is a video by ETVBHARAT, published on October 29, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
<p>Bahuda River Overflows : అర్నబ్ తుపాను ప్రభావంతో మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం జలదిగ్బంధమైంది. ఒడిశాలోని బగలట్టి డ్యాం గేట్లు తెరవడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నీటి మట్టం పెరిగి సమీప గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఈ క్రమంలో నీరు పద్మపురం గెడ్డలో కలిసి ఇనేసుపేట గ్రామాన్ని ముంచెత్తింది. అటు లొద్దపుట్టి, జగన్నాథపురంల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు డొంకూరు, ఇనేసుపేట, తులసిగాం, ఈదుపురం, బొడ్డకాళి ప్రాంతాల్లోని వరిపొలాలు నీట మునిగియాయి.</p><p>ఈ క్రమంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లొద్దపుట్టిలో సహాయకచర్యలు చేపట్టారు. ఏడేళ్ల క్రితం నాటి తిత్లీ తుపాను పరిస్థితులు మరోసారి ఏర్పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్‌రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇనేసుపేట వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అయితే ఇనేసుపేట, లొద్దపుట్టి సమీపంలోని 16వ నంబర్ చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో మిగతా ప్రభావిత గ్రామాలకు వెళ్లే వీలు లేక అక్కడి నుంచే వెనుదిరిగారు. మరోవైపు హైవేపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తమకు సహాయం అందిచాలని జగన్నాథపురం, లొద్దపుట్టి, ఇనేసుపేట ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.</p>