హైదరాబాద్‌లో భారీ శబ్దం - ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు
About this video
హైదరాబాద్‌లో భారీ శబ్దం - ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు is a video by ETVBHARAT, published on October 27, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
<p>Loud Sounds in Hyderabad : హైదరాబాద్‌లో భారీ శబ్దం సంభవించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామి నగర్‌లో ఈ శబ్దం వినిపించింది. ఉదయం 9:15 గంటల సమయంలో బ్లాస్టింగ్‌ను తలపించేలా భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడైనా బ్లాస్టింగ్ చేశారా? లేదా భూకంపం ఏమైనా వచ్చిందా? అంటూ ప్రజల్లో చర్చ మొదలైంది. ఈ భారీ శబ్దం వెనక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.</p><p>రాజేంద్రనగర్‌లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మొదటగా ఎక్కడైనా గ్యాస్ పేలిందేమో అనుకున్నామని హైదర్‌గూడలోని పలు కాలనీల వాసులు చెబుతున్నారు. శబ్దానికి అందరూ ఒకేసారి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చూశామని, కానీ ఏమైందో అర్థం కాలేదని తెలిపారు. ఏదైనా భవన నిర్మాణంలో ప్రమాదం జరిగిందా? భూమి కంపించిందా? లేదంటే ఎవరైనా బ్లాస్టింగ్ చేశారా అనే అంశాలపై ఆరా తీస్తున్నామని, ప్రజలెవరూ అధైర్య పడొద్దని పోలీసులు తెలిపారు.</p>