ఓటింగ్ విధానంలో సరికొత్త విప్లవం - ఈవీఎం వీవీపీ ప్యాట్ రూపొందించిన యువ ఇంజినీర్లు
About this video
ఓటింగ్ విధానంలో సరికొత్త విప్లవం - ఈవీఎం వీవీపీ ప్యాట్ రూపొందించిన యువ ఇంజినీర్లు is a video by ETVBHARAT, published on October 27, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
<p>EVM VV Pat Innovation : నెక్ట్స్ జనరేషన్ ప్రొటోటైప్ ఓటింగ్ మిషన్స్‌ను జి.నాగేశ్వర్ రావు, ఉమా మహేశ్వర్ రావు, శివ ప్రసాద్ అనే ముగ్గురు యువకులు కనుగొన్నారు. ఇప్పుడున్న ఓటింగ్ మిషన్ కంటే మెరుగైన ఫీచర్స్‌తో వీటిని రూపొందించినట్లు నాగేశ్వర్ రావు చెప్పారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈవీఎం వీవీపీ ప్యాట్ పనితీరును వివరించారు. తాము కనుగొన్న ఈ మిషన్ పారదర్శకంగా పని చేస్తుందని, వయోజనుల ఓటింగ్‌కు న్యాయం జరుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.</p><p>ఈవీఎం మెషీన్ భౌతికంగా ప్రింట్ అయ్యే పేపర్‌ను వీవీ ప్యాట్ అంటారు. దీంట్లో ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీకి ఓటు వేసినట్టు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు లేదా గవర్నమెంట్ అఫిలేట్ ప్రకారం 5 శాతం మాత్రమే లెక్కిస్తాం. మిగతా 95 శాతం ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు. అన్ని ఓట్లు ఒకే దగ్గర వేయడం వల్ల 7 సెకన్ల తర్వాత కట్ అయి పడిపోతున్నాయి. ఫలితాలు వచ్చినపుడు ఏ పార్టీకి సంబంధించిన డిజిటల్ ఖాతా వాటికే ఉండి డిస్ప్లేలో కనిపిస్తుంది. వీవీపీ ప్యాట్‌లో ఓటు వేసినపుడు క్యాండిడేట్ లేదా పార్టీకి సంబంధించిన రోల్లో ప్రింట్ అవుతుంది. ఫలితాలు ప్రత్యేకంగా లెక్కించాల్సిన పని లేదు. - జి. నాగేశ్వర్ రావు, ఇంజినీర్</p>