బస్సు ఆపలేదని డ్రైవర్‌పై యువకుల దాడి - వీడియో వైరల్
About this video
బస్సు ఆపలేదని డ్రైవర్‌పై యువకుల దాడి - వీడియో వైరల్ is a video by ETVBHARAT, published on October 28, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
<p>Kokkanti RTC Driver Attack Video : బస్సును ఆపలేదన్న కోపంతో ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బస్సు బెంగళూరు నుంచి కదిరికి వెళ్తుండగా అన్నమయ్య జిల్లా మద్దన్నగారిపల్లి వద్ద నలుగురు యువకులు బస్సు ఎక్కేందుకు ఆపారు. అక్కడ స్టేజ్ లేదన్న ఉద్దేశంతో డ్రైవర్ బస్సును ఆపకుండా వచ్చేశారు.</p><p>దీంతో కోపంతో ఊగిపోయిన ఆ నలుగురు యువకులు ద్విచక్ర వాహనాల్లో వెంబడించి తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద బస్సును ఆపారు. ఈ క్రమంలో డ్రైవర్ వేమన్న నాయక్‌ను చితకబాదారు. ఇది గమనించిన స్థానికులు యవకులను అడ్డుకొని డ్రైవర్‌ను రక్షించారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విశ్వనాథ్, మధుకుమార్, సునీల్, రాముపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తనకల్లు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.</p>