తీరప్రాంత గ్రామాలపై అర్నబ్ తీవ్ర ప్రభావం - దెబ్బతిన్న పడవలు
About this video
తీరప్రాంత గ్రామాలపై అర్నబ్ తీవ్ర ప్రభావం - దెబ్బతిన్న పడవలు is a video by ETVBHARAT, published on October 28, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
<p>Boats Damaged Due To Arnab Cyclone : రాష్ట్రవ్యాప్తంగా విరుచుకుపడుతున్న అర్నబ్ తుపాన్ విశాఖపట్నం జిల్లా తీర ప్రాంతాలపై తీవ్ర ప్రతాపం చూపింది. ముఖ్యంగా నక్కపల్లి మండలం పరిధిలోని తీరప్రాంత గ్రామాల్లో తుపాన్ భీకర విధ్వంసాన్ని మిగిల్చింది. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడుతుండటంతో తీరంలో లంగరు వేసిన మత్స్యకారుల పడవలు, వలలు దెబ్బతిన్నాయి. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, బోయపాడు తీరాల్లో సముద్రపు అలల ధాటికి మత్స్యకారుల పడవలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. వేట కోసం తీరంలో సిద్ధంగా ఉంచుకున్న మూడు సాంప్రదాయ తెప్పలు, సముద్రపు ఉధృతికి కొట్టుకుపోయాయని, దీంతో తాము ఉపాధి కోల్పోయామని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బోయపాడు తీరానికి భారత నావికాదళానికి చెందిన ఒక గుర్తుతెలియని పెద్ద రక్షణ/సముద్ర పరిశోధన పరికరం కొట్టుకురావడం స్థానికంగా కలకలం రేపింది. దీనిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. తుపాన్ ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు నక్కపల్లి మండలంలోని డీఎల్‌పురం, చందనాడ పరిసర ప్రాంతాలలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై విరిగిపడ్డాయి. దీంతో ఆయా మార్గాల్లో రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే నగరపాలక, విపత్తు నిర్వహణ సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. కట్టర్లు, జేసీబీల సహాయంతో రోడ్లపై పడిన చెట్లను, విద్యుత్ స్తంభాలను యుద్ధప్రాతిపదికన తొలగించి, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్గాన్ని సుగమం చేశారు.</p>