Dailymotion

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

ETVBHARAT10/27/2026

About this video

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు is a video by ETVBHARAT, published on October 27, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.

Description

<p>VIPs Visit Tirumala Temple : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి మోహన కృష్ణ తన కుటుంబ సభ్యులు రూపా, సీమంతితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్, తెలంగాణ మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్​లు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు. ఆలయంలో సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి రెడ్యా నాయక్ అన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.</p><p>తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 32 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,697 మంది భక్తులు దర్శించుకోగా, 25,781 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు వచ్చింది.</p>