అర్నబ్ ఎఫెక్ట్ - నిలిచిన చేపల వేట - ఒడ్డుకు చేరిన బోట్లు
About this video
అర్నబ్ ఎఫెక్ట్ - నిలిచిన చేపల వేట - ఒడ్డుకు చేరిన బోట్లు is a video by ETVBHARAT, published on October 27, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
<p>Massive Boats Along Coastal Areas of Bapatla : అతి తీవ్ర తుపాను నేపథ్యంలో సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బాపట్ల జిల్లా రేపల్లె, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో బోట్లు హార్బర్ జెట్టీలో నిలిపివేశారు. మెకనైజడ్ బోట్లన్నీ నిజాంపట్నం హార్బర్, జెట్టీల వద్దకు చేరాయి. కొత్తపాలెం, నక్షత్ర నగర్, పెనుమూడి, లంకెవానిదిబ్బలోని ఫైబర్ బోట్లను మత్స్యకారులు ఒడ్డుకు చేర్చారు. </p><p>ఒకసారిగా బోట్లు అన్ని జెట్టీల వద్దకు చేరుకోవటంతో సందడి వాతావరణం నెలకొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరైనా సముద్రంలో వేటకు వెళ్తే చర్యలు తీసుకుంటామని రేపల్లె మత్స్యశాఖ ఏడీ సైదా తెలిపారు. బోట్లను లంగర్లతో కట్టేసి వలలు సామాగ్రిని భద్రపరుచుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంపై అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. </p>