Dailymotion

వర్షానికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్​ - రాకపోకలకు అంతరాయం

ETVBHARAT10/28/2026

About this video

వర్షానికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్​ - రాకపోకలకు అంతరాయం is a video by ETVBHARAT, published on October 28, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.

Description

<p>Severe Damage To Railway Tracks : అల్లూరి జిల్లాపైనా అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్ చూపుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు మండలం పరదానీపుట్టు వాగు ఉప్పొంగుతోంది. పెదబయలు, పాడేరు, జి.మాడుగుల మండలాలను కలిపే రహదారి కావడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హుకుంపేట ఆసుపత్రి ఆవరణలో భారీ చెట్టు విరిగిపడి సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడ్డారు. బాకూరుజర్రకొండకు వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభంపడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కొయ్యూరు మండలం హైవేపై చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిరండూల్‌-కొత్తవలస రైలు మార్గంలోని బొర్రా - కరకవలస రైలు స్టేషన్ల మధ్య భారీ వర్షానికి రైలు పట్టాలకు తీవ్ర నష్టం ఏర్పడింది. రైలు పట్టాల వద్ద ప్రవాహానికి మట్టి జారిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గూడ్స్ రైళ్లు, కొత్తవలస పాసింజర్ సైతం రైల్వే అధికారులు నిలిపివేశారు. రైల్వే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ట్రాక్ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.</p>